
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 1 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి
యాడికి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు మండలంలో విద్య ఆరోగ్య సామాజిక సేవ కార్యక్రమాలలో సేవలందిస్తున్న వారికి రాయల చారిటబుల్ ట్రస్ట్ పౌండర్ శ్రీ పసల శ్రీధర్ గారు వారి సేవలను గుర్తించి సన్మానం చేయడం జరిగింది. ఫీజికల్ డైరెక్టర్ సంజీవరాయుడు గారిని సన్మానిస్తూ 10 వేల రూపాయలు చెక్కును అందించడం జరిగినది. యోగ శిక్షకుడు అయిన గరిడి శివన్న గారిని, మే ఐ హెల్ప్ యూ ప్రసిడెంట్ బండారు బాలకృష్ణ గారిని, ధ్రువ నారాయణ గారిని, కోన రోడ్ తో వృద్ధాశ్రమం నిర్వహిస్తున్న వెంకట రాముడు గారిని, గతంలో చందన హై స్కూల్ నందు పనిచేసిన సంజీవరాయుడు గారిని సన్మానిoచడం జరిగినది. ఈ కార్యక్రమం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సీతా రామాంజనేయులు గారు అధ్యకత వహించడం జరిగినది. Meo కాశప్ప సార్, రాయల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీనివాసులు, శశిధర్, ఆనంద్, బండారు బాల మొదలైన గ్రామ పెద్దలు,శ్రీనివాసుల యాదవ్ రవికుమార్ నాగన్న మంజులవాణి శ్రీదేవి వారిస్ మెదలగు ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగినది.
