బీఆర్ఎస్ యువనాయకుడు వై. రవీందర్ యాదవ్
మొగిలిగిద్ద గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన వై. రవీందర్ యాదవ్
( పయనించే సూర్యుడు జనవరి 12 షాద్నగర్ రిపోర్టర్ రవీందర్ )
సామాజిక సంబంధాల పెంపులో క్రీడలు ప్రముఖ పాత్ర పోషిస్తాయని బీఆర్ఎస్ యువ నాయకుడు వై రవీందర్ యాదవ్ అభిప్రాయపడ్డారు. ఆదివారం ఫరూక్ నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన అనంతరం మాట్లాడారు.క్రీడలు అనేవి మన ఆరోగ్యం, శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత,ప్రజల సంబంధాల అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. క్రీడల ద్వారా శక్తి, చురుకుదనం, ఫిట్‌నెస్ వస్తుందని,ఒత్తిడి నివారించడంలో, ఆత్మవిశ్వాసం పెంపొందించడంలో తోడ్పడుతాయని పేర్కొన్నారు. క్రీడల జట్లు సహకారం, సమన్వయం, మరియు నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేస్తుందని చెప్పారు.జాతీయ గర్వాన్ని పెంపొందించడంలో, ప్రాంతీయ క్రీడలు ఎంతో ప్రాధాన్యం కలిగి ఉంటాయని, అన్ని వర్గాల ప్రజలు తమకిష్టమైన క్రీడారంగంలో రాణించాలని కోరారు. క్రికెట్, వాలీబాల్ వంటి క్రీడలతో పాటు యోగ, వాకింగ్, మెడిటేషన్ వంటి కార్యక్రమాలలో పాల్గొండాలని యువతకు సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు లక్ష్మణ్ నాయక్ నాయకులు వీరేశం గుప్తా, వెంకట్ రెడ్డి, బిశ్వ రామకృష్ణ, యాదయ్య గౌడ్, చందు నాయక్, హాన్య నాయక్, బుగ్గ కృష్ణ, బాలరాజ్, శ్రీను, అంజయ్య, శివశంకర్, శ్యామ్, రాజు, రమేష్ తదితరులు, గ్రామస్థులు, క్రీడాకారులు పాల్గొన్నారు.