
పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 19 నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని సాలురా మండల కేంద్రంలో ఈరోజు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సాలురా సంఘం నుండి డప్పులతో బస్టాండ్ ప్రాంగణంలోకి చేరుకొని బాబు జగ్జీవన్ రావ్ విగ్రహం వద్ద ఘనంగా సంబరాలు జరుపుకున్నారు సాలుర మండల ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు బూరె శంకర్ మాట్లాడుతూ పద్మశ్రీమందకృష్ణ మాదిగ సుదీర్ఘ కాలం మడమ తిప్పకుండా రాజీలేని పోరాటం చేయడం వలన నేడు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందింది.ఎస్సీ వర్గీకరణ ఆమోదం పొందడాన్ని స్వాగతిస్తూ ఎమ్మార్పీఎస్ , MSP ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంబరాలు నిర్వహించడం జరిగింది.అలాగే మాదిగ అమరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు.మంద కృష్ణ మాదిగ లేకుంటే ఎస్సీ వర్గీకరణ పోరాటం లేదని అన్నారు.తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ ఆమోదం పొందడం ద్వారా 70 ఏళ్ల మాదిగల కల నెరవేరిందని అన్నారు.డా.అంబేద్కర్ దళితులకు రిజర్వేషన్లు అందిస్తే మంద కృష్ణ మాదిగ ఆ రిజర్వేషన్లను దళితుల్లోని అన్ని కులాలకు అందిస్తున్నారని అన్నారు.న్యాయమైన లక్ష్యం కోసం పోరాటం బలంగా చేస్తే ఏనాటికైనా విజయం వరిస్తుందని ఎమ్మార్పీఎస్ ఉద్యమం రుజువు చేస్తుందని అన్నారు.మాదిగ అమరుల త్యాగాలు ఉద్యమం లక్ష్యం వైపు సాగేలా నడిపించాయని ,అమరులకు జోహార్లు తెలిపారు.ఎస్సీ వర్గీకరణ కోసం సహకరించిన అన్ని పార్టీలకు , సంఘాలకు కృతజ్ఞతలు తెలిపారుఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ముఖ్య అతిథులు MJF లింబూర్ లక్ష్మణ్ మాదిగ, మండల ఉపాధ్యక్షులు చింతం బాలరాజు మాదిగ, మండల ప్రధాన కార్యదర్శి రెడ్డి దిలీప్ మాదిగ, ప్రచార కార్యదర్శి రెడ్డి శ్యామల మాదిగ, మండల సభ్యులు రెడ్డి నాగేష్ మాదిగ, గంగన్ శివ మాదిగ, సాలుర గ్రామ అధ్యక్షులు ధమన్గావ్ సుభాష్ మాదిగ, పిల్లల చాందు మాదిగ, కునింటి సంతోష్ మాదిగ, లక్ష్మణ్ మాదిగ మరియు వివిధ సాలూర మండల గ్రామ పెద్దలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు