
యజ్ఞం నిర్వహిస్తున్న విగ్రహ దాత స్వామి గౌడ్. పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 22 నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని సాలూర మండలంలో దేవి మాత శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి.మండల కేంద్రంలో వెలసిన దుర్గామాత మొదటి రోజు బాలా త్రిపుర సుందరి అవతారంలో దర్శనమిచ్చారు.దేవి మాతా మండపాన్ని నిర్వాహకులు సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.మండపనిర్వాహకులు, గ్రామ పెద్దలు,గ్రామస్తులు, యువకులు,మహిళలు మండపం వద్దకు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.విగ్రహ దాత స్వామి గౌడ్ అమ్మవారి సన్నిధానంలో కుటుంబ సమేతంగా యజ్ఞం చేశారు.మండపం వద్దకు గ్రామస్తులు,భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది.తొమ్మిది రోజుల పాటు వివిధ అవతారాలతో దేవి మాత దర్శనం ఇవ్వనున్నారు.నవరాత్రులు విశేష పూజలు నిర్వహించనున్నట్లు మండప నిర్వాహకులు తెలిపారు.గ్రామ పెద్దలు,గ్రామ మహిళలు,యువకులు సహకారం అందిస్తూ అమ్మవారి నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయవలసిందిగా మండప నిర్వాహకులు కోరారు.ఈ పూజా కార్యక్రమంలో గ్రామ పెద్దలు,మండప నిర్వాహకులు,మహిళలు,యువకులు,చిన్నారులు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.