
పయనించే సూర్యుడు మే 5 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
చేజర్ల మండలం ఓబులాయపల్లి గ్రామంలో భారతీయ మహాసేన ఆధ్వర్యంలో నేటి ఉదయం 10 గంటలకు చలనం సంస్థ అధినేత, బహుజనవాది, రిటైర్డ్ టీచర్ చింతల జాషువా అధ్యక్షతన సావిత్రి భాయి ఫూలే సాయంకాలం బడి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం వేసవిలో పిల్లలను బయట తిరగనీయకుండా 1 వ తరగతి నుండి 9 తరగతి పిల్లందరినీ ఒకచోటకు చేర్చి వాళ్ళందరికీ ఉచితంగా చదువు చెప్పించడం, అలాగే ఆటలు, పాటలు, డ్రాయింగ్ నేర్పించి జూన్ నెలలో పరీక్షలు నిర్వహించి పిల్లలకు బహుమతులు అందించడం జరుగుతుందని భారతీయ మహాసేన వ్యవస్థాపక అధ్యక్షులు జువ్విగుంట బాబు .బీఎంఎస్ బాబు తెలిపారు. ఈ సావిత్రి భాయి ఫూలే సాయంకాలం బడి కార్యక్రమం ఇద్దరు టీచర్లతో ప్రతిరోజూ ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరుగుతుందని, ప్రతిరోజూ పిల్లలకు అల్పాహారం కూడా అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్న ఆ గ్రామస్థులు బీఎంఎస్ నాయకులు జె. ప్రసాద్ మరియు ఎం. యాదగిరి లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమం ఆ గ్రామ పెద్దలు జె. నారయ్య . బీటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టేటి రమేష్ చేతుల మీదగా ఫూలే దంపతులు . బాబాసాహెబ్ అంబేడ్కర్ చిత్ర పటాలకు పుష్పాలతో నమస్కరించి కొవ్వొత్తులను వెలిగించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు నాయకులు విద్య యొక్క ప్రాముఖ్యత గురించి పిల్లలకు వివరిస్తూ వేసవి సెలవులు పూర్తయ్యే వరకు ఈ సాయంకాలం బడి కొనసాగేందుకు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. సావిత్రి భాయి ఫూలే సాయంకాలం బడికి ప్రారంభం నుంచి చివరి వరకు అయ్యే పూర్తి ఖర్చులు తన సొంత నిధులతో జువ్విగుంట బాబు నిర్వహిస్తున్నందుకు చింతల జాషువా, బీటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టేటి రమేష్, పలువురు నాయకులు, గ్రామస్థులు జువ్విగుంట బాబుకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఎంఎస్ ఫౌండర్ జువ్విగుంట బాబుతో పాటు చింతల జాషువా, చిట్టేటి రమేష్, కట్టమంచి అరుణ, అర్జున బాలకృష్ణ, ఉపాధ్యాయులు టీ.సురేష్, బి. రఘుబాబు, శంకర్ . బీఎంఎస్ నాయకులు జువ్విగుంట ప్రసాద్, మేరిగ యాదగిరి, ఉదయగిరి శ్రీనివాసులు, రాచూరి మధు, గుమ్మళ్లపాటి పెంచలయ్య, జువ్విగుంట అంకమ్మ, గ్రామస్తులు పాల్గొన్నారు.
