
పయనించే సూర్యుడు. మార్చి 16. ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్
కులమతాలకు అతీతంగా సింగరేణి గ్రామంలో సేవా కార్యక్రమాలు. హిందూ స్మశానవాటిక కు రూ.25 వేల సబ్ మెర్సబుల్ పంప్ సెట్టు వితరణ. తన సేవా తత్పురతను చాటుకుంటున్న బీఆర్ఎస్ మైనార్టీ సెల్ జిల్లా నాయకులు, జామే మస్జిద్ మాజీ అధ్యక్షులు షేక్ గౌసిద్దీన్. కారేపల్లి: సింగరేణి గ్రామ ప్రజల శ్రేయస్సే తన ధ్యేయమని, వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని బీఆర్ఎస్ మైనార్టీ సెల్ జిల్లా నాయకులు , జామే మస్జిద్ మాజీ అధ్యక్షులు షేక్ గౌసుద్దీన్ తన అభిప్రాయాన్ని తెలిపారు. 6,000 జనాభా ఉన్న సింగరేణి గ్రామంలో హిందూ స్మశాన వాటిక.. అసౌకర్యాల నడుమ ఉందని, దహన సంస్కారాల సమయంలో.. నీటి సౌకర్యం లేకపోవడం, కేవలం ఒక బోరింగ్ మీదనే ఆధారపడటంతో.. స్మశాన వాటికలో బోరు పాయింట్ వేసి, సబ్మేర్సబుల్ పంపుసెట్లు బిగించి నీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని తలంచాడు. అనుకున్నదే తడవుగా.. గ్రామ పెద్దలను కలిసి తన వంతుగా రూ. 25 వేల విలువ గల సబ్మెర్సబుల్ పంపు సెట్టును వితరణగా అందజేసినట్లు పేర్కొన్నాడు. సింగరేణి గ్రామ ప్రజల అభివృద్ధి ధ్యేయంగా మునుముందు తన సేవా కార్యక్రమాలను విస్తరింప చేయనున్నట్లు పేర్కొన్నాడు. మానవసేవే మాధవసేవ అని, సింగరేణి గ్రామానికి.. ఏ అవసరం వచ్చినా, తాను ముందు ఉంటానని వివరించాడు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు తురక నారాయణ, జడల వెంకటేశ్వర్లు, రవీందర్, తురక రాంబాబు, కెతిమాల శ్రీను, జూపల్లి వెంకన్న, గడ్డం కోటి, అక్కుల శ్రీను, షేక్ జహీర్, ఆరెల్లి రాజలింగం, కసగాని సుబ్బయ్య, మణికొండ సత్యం, పోతు వెంకటేశ్వర్లు, గంగరబోయిన వెంకన్న, మురళి సిద్ధూ, తురక సాంబ, చింతల సంపత్, తోటమల్ల శ్రీను, పానుగంటి విజయ్, పబ్బుల శేషయ్య, కసగాని రామారావు , జంగా కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
