
పయనించే సూర్యుడు మార్చ్ నిజామాబాద్ జిల్లా బ్యూరో పీకే గంగాధర్
తెలంగాణ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో టి పి సి సి అధికార ప్రతినిధి బాస వేణుగోపాల్ యాదవ్ మాట్లాడుతూ బీసీ లకు 42 శాతం రిజర్వేషన్స్ కల్పిస్తూ తీసుకొచ్చిన బిల్లు ను శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ కమ్మర్ పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింకట రవి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి పాలాభిషేకం చేయడం జరిగింది దీని సందర్భంగా టీ పీసీసీ అధికార ప్రతినిదీ బాస వేణుగోపాల్ యాదవ్ మాట్లాడుతూ
బడుగు బలహీన వర్గాలకు రాజకీయంగా విద్య వైద్య ఉద్యోగ పరంగా 42 శాతం రిజర్వేషన్స్ ను అవకాశాలను కల్పించే విధంగా తీసుకొచ్చిన బిల్లు గొప్ప చారిత్రత్మిక విజయమని అన్నారు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నాయకుడు రాహుల్ గాంధీ ఆలోచన మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాచారం తీసుకొని బీసీ కులగణ చేపడితే బిసి ల జనాభా 56% తేలిందని అన్నారు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకు వెన్నంటూ ఉందని కామారెడ్డి
బీసి డిక్లారేసన్ లో మాట ఇచ్చిన ప్రకారం మాట నిలబెట్టుకొని 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని అన్నారు
బీసీ ల కుల గణన చేపట్టి అసెంబ్లీలో ఆమోదింప చేసుకోవడం దేశంలో నే మొట్ట మొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రం అన్నారు 42 శాతం రిజర్వేషన్ల అమలు కు కేంద్రo ఆమోదం తెలిపే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ 8 మంది బీజేపీ ఎంపీ లు ఒత్తిడి తీసుక రావలన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సుంకేట రవి మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య నిమ్మ రాజేంద్ర ప్రసాద్ మాజీ ఎంపిపి గుడిసె అంజమ్మ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రెడ్డబోయిన నరేందర్ ముదిరాజ్ సుంకేట శ్రీను. షేక్ మూకీం. తక్కురి శేఖర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు