
సిద్దాపూర్ లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న దృశ్యం…
రుద్రూర్, ఏప్రిల్ 04 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :
రుద్రూర్ మండలంలోని సిద్దాపూర్ గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వర్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ సురేష్ బాబా ప్రారంభించారు. ధాన్యానికి మద్దతు ధర ఇవ్వడానికే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లక్ష్మణ్, విండో మాజీ చైర్మన్ పత్తి రాము, ఐకెపీ ఏపీఎం భాస్కర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటా అరుణ్ కుమార్, తోట సంగయ్య, రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.