
పయనించే సూర్యుడు జూలై 21 (సూళ్లూరుపేట మండలం రిపోర్టర్, దాసు) :
సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని వై జంక్షన్ దగ్గరలో ఉన్న చేపల దుకాణాలు ఎత్తివేయాల్సిందిగా షార్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ తెలియపరచగా దీనికిగాను చాపల దుకాణదారులు సాయిబాబా గుడి దగ్గర నుండి వై జంక్షన్, హోలీ క్రాస్ సర్కిల్ లోపల షార్ అధికారులతో సంప్రదించి ప్రత్యేక స్థలము ఏర్పాటు చేయవలసిందిగా కోరుతూ సూళ్లూరుపేట మున్సిపల్ కమిషనర్ చిన్నయ్య కు భారత కమ్యూనిస్టు పార్టీ పట్టణ సమితి ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపి సహాయ కార్యదర్శి ఆనందబాబు, పీ. లక్ష్మి , సిపిఐ పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది
