
పయనించే సూర్యుడు జులై 21 (పొనకంటి ఉపేందర్ రావు )
ఇల్లందు: ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు 85 మంది లబ్ధిదారులకు మంజూరు అయిన 27 లక్షల సీఎం.ఆర్.ఎఫ్ చెక్కులను ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య లబ్ధిదారులకు సోమవారం క్యాంపు కార్యాలయంలో చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదరికంతో బాధపడుతూ.. అనారోగ్యాల బారిన పడుతున్న వారికి వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం అందించడం ద్వారా ప్రభుత్వం భరోసాగా నిలుస్తుంది అన్నారు. చెక్కు తీసుకున్న లబ్ధిదారులు బ్యాంకుల్లో వేసుకోవాలని సూచించారు.ప్రజలు ఏరి కోరి తెచ్చుకున్న ఇందిరమ్మ ప్రభుత్వానికి ఏడాదిన్నర పూర్తి కావస్తుందని తెలిపారు. ఈ ఏడాదిన్నెర కాలంలో మహిళలకు ఉచిత బస్సు, ఉచిత విద్యుత్, రైతు భరోసా, సన్నాలకు బోనస్, రేషన్ షాపుల ద్వారా ఉచిత సన్న బియ్యం ఇందిరమ్మ ఇల్లులు ఇలా అనేక సంక్షేమ పథకాలను అమలు చేసింది మన కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్లే సంక్షేమ పథకాలు ప్రజల దరి చేరడంలో కాస్త ఆలస్యం అవుతుంది. ఎన్నిక ఏదైనా కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే వారికి ప్రజలు ఆశీస్సులు అందించాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ రాంబాబు, పట్టణ మండల అధ్యక్షులు దొడ్డ డానియల్ పులి సైదులు, మాజీ వైస్ ఎంపీపీ మండల రాము, మడుగు సాంబమూర్తి, బొల్లా సూర్యం, చిల్లా శ్రీనివాస్, పట్టణ మండల నాయకులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, 24 వార్డు ముఖ్య నాయకులు, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఐఎన్టియుసి నాయకులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు