
పయనించే సూర్యుడు అక్టోబర్ 21 (ఆత్మకూరు నియోజకవర్గ ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆధ్వర్యంలో కిమ్స్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తాళ్లూరి గిరినాయుడు సూచనలతో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన చేజర్ల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు షేక్ సిరాజుద్దీన్ మంగళవారం చెక్కులు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా మండల అధ్యక్షులు సిరాజుద్దీన్ మాట్లాడుతూ ఆత్మకూరు నియోజవర్గాన్ని రామనారాయణ రెడ్డి అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని అన్నారు.అలాగే ఆంధ్ర రాష్ట్రంలో పేద మధ్యతరగతి కుటుంబాలపై ఆరోగ్య భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారుఈ కార్యక్రమంలో ఏటూరు తెలుగుదేశం పార్టీ నాయకులు. కార్యకర్తలు అభిమానులు సిహెచ్.రామానాయుడు , లబ్ధిదారులు పాల్గొన్నారు.