పయనించే సూర్యుడు న్యూస్ : జనవరి 13అనంతసాగరం మండలం, నెల్లూరు జిల్లా (రిపోర్టర్: వెంకటరమణారెడ్డి)
అనంతసాగరం మండలం గుడిగుంట గ్రామానికి చెందిన నందిమడలం వెంకటరమణ రాజు ఇటీవల కాలంలో అనారోగ్యంపాలై పెద్ద మొత్తంలో ఆసుపత్రి ఖర్చులైన సంగతిని తెలుగుదేశం మండల అధ్యక్షురాలు మూనగపాటి సునీత దృష్టికి వెంకటరమణ రాజు కుటుంబ సభ్యులు తీసుకెళ్లి సీఎం ఫండ్ కోసం అభర్ధన చేయటంతో , ఈ విషయాన్ని సునీతమ్మ ,గౌరవనీయులు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.వెంటనే మంత్రి ఆనం స్పందించి సీఎం రిలీజ్ ఫండ్ నుంచి 84928 రూపాయలు వచ్చేలా కృషిచేశారు .ఈ విషయాన్ని సునీతమ్మ వెంకటరమణ రాజుకి తెలియజెసి అందచేయటం జరిగింది .ఈ సందర్బంగా వెంకటరమణ రాజు మాట్లాడుతూ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డికి ,సునీతమ్మ కి కృతజ్ఞతలు తెలియజేయటం జరిగింది . అదేవిదంగా మండల అధ్యక్షురాలు సునీతమ్మ మాట్లడుతూ ఇది ప్రజా ప్రభుత్వం అని ప్రజలకు ఏ సమస్య వచ్చినా ,మంత్రి ఆనంకి తెలియజేసిన వెంటనే సమస్య పరిస్కారం చూపటంలో ముందుంటారని కొనియాడటం జరిగింది .ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ,కార్యకర్తలు పాల్గొనటం జరిగింది .