
పయనించే సూర్యుడు ఆగస్టు 3 (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి :ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను సులానగర్ జిల్లా మలేరియా ఆఫీసర్ డాక్టర్ స్పందన సందర్శించారు ఈ సందర్భంగా ల్యాబ్ లో చేస్తున్న రక్త పరీక్షల వివరాలను అడిగి తెలుసుకుని సంబంధించిన రికార్డులని పరిశీలించి ల్యాబ్ టెక్నీషియన్ రాజుకి తగిన సూచనలు సలహాలు ఇచ్చి జ్వరం లక్షణాలు ఉన్న వారికి డెంగ్యూ మలేరియా నిర్ధారణ కొరకు త్వరితగతిన ఫలితం తేలే ఆర్డిటి పరీక్షలు నిర్వహించి ఎలీసా పరీక్ష నిర్ధారణ కొరకు తెలంగాణ హబ్ పరీక్షా కేంద్రానికి రక్త నమోనాలను పంపించవలసిందిగా ఆదేశించారు క్షేత్రస్థాయిలో వైద్య సిబ్బంది ఆశా కార్యకర్తలు ఈ సీజన్ లో వచ్చే వ్యాధులపై బాగా దృష్టి పెట్టాలని అలాగే దోమ కాటు ద్వారా వచ్చే వ్యాధులపై మరియు దోమలు పుట్టకుండా పెరిగిన దోమలు కుట్టకుండా ఉండడానికి అవసరమైన రక్షణ చర్యలపై ప్రజలకు నిత్యం అవగాహన కల్పించాలని ప్రతి శుక్రవారం మరియు మంగళవారం డ్రై డే విధిగా నిర్వహించాలని జ్వర పీడితులను గుర్తించడానికి ప్రతి నెల 7వ తారీకు నుండి 17వ తారీకు వరకు గ్రామాలలో డోర్ టు డోర్ సర్వే నిర్వహించాలని గత సంవత్సరం డెంగ్యూ మలేరియా నమోదైన హై రిస్క్ గ్రామాలలో ప్రత్యేక సర్వే చేసి అనుమానితుల్ని గుర్తించి తగు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేపించాలని పారామెడికల్ సిబ్బందిని ఆదేశించారు గ్రామాలలో పంచాయతీ కార్యదర్శులు మరియు పారిశుద్ధ్య సిబ్బంది సహకారం తీసుకొని గ్రామాలలో చెత్తాచెదారం నీటి నిల్వలు లేకుండా చేయడం వల్ల ఈ సీజనల్ వ్యాధుల్ని మనం సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని డాక్టర్ స్పందన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ కంచర్ల వెంకటేష్ ఆరోగ్య విస్తరణాధికారి దేవా స్టాఫ్ నర్స్ జగదాంబ సూపర్వైజర్ నాగు బండి వెంకటేశ్వర్లు కౌసల్య సింగ్ ల్యాబ్ టెక్నీషియన్ రాజు ఫార్మసిస్ట్ కిరణ్ కుమారి తదితరులు పాల్గొన్నారు