
పయనించే సూర్యుడు, సెప్టెంబర్ 13,బూర్గంపాడు మండల రిపోర్టర్ పోతుగంటి రామ్ ప్రసాద్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం, సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సారపాక పార్టీ కార్యాలయంలో సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాల వేసి జోహార్లు అర్పించారు. అనంతరం సిపిఎం మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సీతారాం ఏచూరి వంటి మహా గొప్ప నాయకుడు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమని తన మరణం పార్టీకి తీరని లోటు అని అన్నారు రాజకీయ రంగంలో ఆయన లేని వెలితి స్పష్టంగా కనిపిస్తున్నది భారత రాజ్యాంగ మౌలిక విలువలైన ప్రజాస్వామ్యం, లౌకికవాదం, ఫెడరలిజం ,సామాజిక న్యాయం, సమానత్వం సోషలిజంపై బిజెపి కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన దాడి చేస్తున్న తరుణంలో దాన్ని ఎదిరించి పోరాడే శక్తులను ఐక్యపరిచి ముందుకు తీసుకుపోవటంలో సీతారాం ఏ సూరి కృషి ఎంతో ఉంది, ఇప్పుడు ఆయన మన మధ్య లేకపోయినా
ఆ ఒరువడిని మరింత పటిష్టంగాముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని భారతీయత భావనకు పునాది మన సాంస్కృతిక వారసత్వంలో ఉందని సీతారాం ఏచూరి ప్రగాఢంగా నమ్మారు ఆయన రచనల్లో ఉపన్యాసంలో ఈ అంశాన్ని తప్పకుండా ప్రస్తావించేవారు ఈ సమ్మిశ్రిత సంస్కృతిక వారసత్వాన్ని ఆర్ఎస్ఎస్ మతోన్మాద శక్తులు ద్వంసం చేస్తున్నాయి ఆర్ఎస్ఎస్ రాజకీయ విభాగమైన బిజెపి అధికారాన్ని రాజ్యాంగ వ్యవస్థలను ఉపయోగించుకొని మరింత వినాశకరమైన దాడులు చేస్తున్నది దీన్ని ఎదిరించి మన సమ్మిశ్రిత సంస్కృత వారసత్వాన్ని కాపాడుకోవడం మన దేశం పురోభివృద్ధికి అంతిమంగా సోషలిస్టు సమాజం సాధనకు అవసరం అని అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులు కనకం వెంకటేశ్వర్లు, ఎస్.కె హుస్సేను, వీరన్న, భాష, రాము, కాశిరెడ్డి, వినోదు, వీరయ్య ,ప్రభాకర్, హనుమంతు తదితరులు పాల్గొన్నారు