
పయనించే సూర్యుడు// న్యూస్// ఏప్రిల్6//మక్తల్
తెలంగాణ బాలల హక్కుల కమిషన్ చైర్ పర్సన్ గా మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలం వర్కాపూర్ కు చెందిన కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి నియమితులయ్యారు. హైదరాబాద్ లో శుక్రవారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. మక్తల్ మండలం మాధ్వార్ గ్రామానికి చెందిన యువకులు శనివారం రోజు సీతా దయాకర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు కమిషన్ చైర్ పర్సన్ గా నియమితులైన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాధ్వార్ యువకులు. ఎర్రం కొల్లా వెంకటేష్. ప్యాటా. రాములు. ప్యాట. అంజప్ప. చిన్నూరు తిమ్మప్ప. కాకి వెంకటప్ప. కాకి శివానంద తదితరులు పాల్గొన్నారు
