
// పయనించే సూర్యుడు// న్యూస్ అక్టోబర్ 23// నారాయణపేట జిల్లా బ్యూరో //
నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం లింగంపల్లి గ్రామంలోని భాగ్యలక్ష్మి కాటన్ మిల్‌లో సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ఈరోజు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి, జిల్లా కలెక్టర్, ప్రజాప్రతినిధులు మరియు రైతులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ రైతుల సంక్షేమం దృష్ట్యా పత్తి కొనుగోలు కేంద్రాలను సకాలంలో ప్రారంభించామని తెలిపారు. పత్తి క్వింటాలుకు ₹8,110 కనీస మద్దతు ధర (MSP) అందించబడుతుందని పేర్కొన్నారు.రైతులు బారులు తీరకుండా సౌకర్యంగా పత్తి అమ్ముకునేందుకు ‘కిసాన్ యాప్’ ను ప్రారంభించామని చెప్పారు.ఈ యాప్ ద్వారా రైతులు కొనుగోలు కేంద్రానికి వెళ్లే సమయాన్ని ముందుగానే బుక్ చేసుకునే అవకాశం ఉందని వివరించారు.రైతులకు యాప్ వాడకంపై పూర్తి అవగాహన కల్పించాలంటూ సంబంధిత అధికారులను ఆదేశించారు.పత్తి ఉత్పత్తిలో నారాయణపేట జిల్లా రాష్ట్రంలో మూడవ స్థానంలో ఉందని పేర్కొంటూ, జిల్లా రైతుల కృషిని మంత్రి అభినందించారు.
