పయనించే సూర్యుడు అక్టోబర్ 28 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
ఈరోజు ఏన్కూరు మార్కెట్ కేంద్రాన్ని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్… అఖిలభారత ఐక్య రైతు సంఘం బృందం వెళ్లి రైతులను. కొనుగోలుదారులను. కార్మికులు కలిసి రైతాంగ సమస్యలు పై ఏన్కూరు మార్కెట్ కార్యదర్శి బి బజార్ నీ కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఖమ్మం జిల్లా నాయకులు ఎస్కే లాల్ మియా అఖిలభారత ఐక్య రైతు సంఘం జిల్లా నాయకుడు కొండే వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ సీజన్లో అధిక వర్షాల వల్ల పత్తి పంటలు పాడైపోయినాయి ఎకరానికి నాలుగు క్వింటాలు రాని పరిస్థితి దిగుబడి ఉంది. తడిసిన పత్తిని నిబంధనలు సడలించి కొనుగోలు చేయాలని. స్వామినాథన్ సిఫారసును అమలు చేయాలని. ఏన్కూరు మండల కేంద్రంలో ప్రభుత్వం సిసిఐ ద్వారా పత్తిని కొనుగోలు చేయాలని కింటా పతికి 10,500 ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎస్ కే జానీ మియా గడ్డం వెంకన్న తదితరులు పాల్గొన్నారు


