రుద్రూర్, సెప్టెంబర్ 26 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి)
రుద్రూర్ మండలంలోని జేయన్సీ కాలనీ లోని 13 వ వార్డులో సీసీ రోడ్లు నిర్మించాలని శుక్రవారం కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేశారు. కాలనీలో సీసీ రోడ్లు లేకపోవడంతో కురిసిన వర్షానికి బురదమయంగా మారుతున్నాయన్నారు. దీంతో నడవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా కాలనీలో డ్రైనేజీలు, వీధి దీపాలు కూడా లేవని వాపోయారు. ఈ సమస్య గురించి గ్రామపంచాయతీ సెక్రటరీకి పలుమార్లు విన్నవించిన పట్టించుకోవడంలేదన్నారు. ఇప్పటికైనా అధికారులు, నాయకులు స్పందించి కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాలని కాలనీవాసులు కోరారు.

