
లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు భూక్యా లాలు నాయక్
పయనించే సూర్యుడు అక్టోబర్ 17 (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి :శుక్రవారం స్థానిక టేకులపల్లిమండలఅగ్రికల్చర్ అధికారికి మెమోరాడం ఇవ్వడం జరిగింది, లంబాడి హక్కుల పోరాట సమితి (LHPS) టేకులపల్లి మండల అధ్యక్షుడు మూడ్ హుస్సేన్ నాయక్ ఆధ్వర్యంలో టేకులపల్లి మండల ఏజెన్సీ ప్రాంతాల్లో ఇష్టానుసారంగా పత్తి కొనుగోలు చేస్తున్నారు, వీరిని పట్టించుకోని నాధుడే లేరు, ఈ ఏడాది కఠిన వాతావరణ పరిస్థితులు, పెరిగిన ఎరువుల, పురుగుమందుల, ధరలు రైతులపై తీవ్రమైన భారం మోపాయని వారు అన్నారు.ప్రత్యేకంగా పత్తి పంట సాగు చేస్తున్న చిన్న, మధ్యతరగతి రైతులు ఉత్పత్తి వ్యయాలు అధికంగా ఉండటంతో తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని అన్నారు.అధిక వర్షాలు వల్ల పత్తి దెబ్బ తీయడం వల్ల ప్రస్తుత మార్కెట్ ధర రైతులకీ సరిపడదని, పత్తి క్వింటాకు రూ.12,000 మద్దతు ధరను కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు.రైతుల కష్టాన్ని గుర్తించి, ఆరు కాలం చెమటతో పండించిన పత్తికి న్యాయమైన ధర అందించడం ప్రభుత్వ ధర్మమని అన్నారు. టేకులపల్లి అగ్రికల్చర్ అధికారి అయిన పై ఆఫీసర్లైన చొరవ చూపి పత్తికి గిట్టుబాటు ధర అందించే విధంగా చూడాలని లేనిపక్షంలో లంబాడి హక్కుల పోరాట సమితి రైతులతో కలిసి టేకులపల్లి వ్యవసాయ మార్కెట్ నందు నినాదం చేసి దిగుతుందని హెచ్చరించారు.పత్తి పంటను గిట్టుబాటు ధర కల్పించడం లేక దళారు చేతుల్లో రైతులు మోసపోతున్నారు, సీసీఐ మద్దత్తు ధర తో కొనుగోలు ప్రారంభించ పోతే తీవ్ర నష్ట అయి పోతారు, పత్తి మద్దత్తు ధరకు ముందే దళారు చేతుల్లో మోసపోతున్నారు, కావున కనీసం మద్దతు ధరకు లేకపోతే రాబోయే రోజుల్లో మీ దగ్గర ఉన్న (కాటా-బాట)ను రైతుల ద్వారానే ఎత్తియడం జరుగుతుంది అని లంబాడి హక్కుల పోరాట(LHPS) డిమాండ్ చేస్తు, రైతులతో మార్కెట్ యార్డుకు వెళ్లడం జరిగింది, గుగులోత్ మాను, బానోత్ కృష్ణ, ఇస్లావత్ జగన్నా, బోడ మంచ,భూక్యా బాలాజీ,భూక్యా వీరు,భూక్యా మంగీలాల్ తదితరులు పాల్గొన్నారు.