ప్రిన్సిపాల్ ఆకుతోట శాంతరాం కర్ణ
పయనించే సూర్యుడు జనవరి 11 హసన్ పర్తి మండలం ప్రతినిధి పోగుల రాజ్ కుమార్
వరంగల్ నగర పరిధిలోని హసన్ పర్తి 66వ డివిజన్ లోని సుజాత విద్యానికేతన్ ఉన్నత పాఠశాలలో ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా రంగోలి ముగ్గులపోటిల కార్యక్రమము పాఠశాల ప్రిన్సిపాల్ ఆకుతోట శాంతారాం కర్ణ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 66వ డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షులు పాపి శెట్టి శ్రీధర్,అతిథులుగా కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు కనపర్తి కిరణ్, మాజీ జెడ్పిటిసి వింజమూరి వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్ పుల్లా రవీందర్ హాజరైనారు. కార్యక్రమంలో మొదటగా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు సంక్రాంతి పాటలతో కోలాహలముగా కోలాటములు ఆడినారు.అతిథులు ఉపాధ్యాయులు విద్యార్థులచే భోగి మంటలు వేయడం జరిగినది. అనంతరము నర్సరీ నుండి ఒకటవ తరగతి పిల్లల వరకు భోగి పళ్ళు పోసి అక్షింతలు వేసి ఆశీర్వదించడం జరిగినది. విద్యార్థులు వేసిన ముగ్గులను అతిథులు సందర్శించి వారిని అభినందించడం జరిగినది. అనంతరం జరిగిన సమావేశ కార్యక్రమంలో ముఖ్య అతిథి పాపిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ మన భారతీయ పండుగలు ప్రకృతిలో మమేకమైన జీవన విధానాన్ని ఆధ్యాత్మికతను ప్రబోధించే విధంగా ఉంటాయని ఈ సంక్రాంతి పండుగ సూర్యుడు ధనుస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించిన ధనుర్మాసంలో వస్తుందని అందుకే పెద్దలు ఈ పండుగను పవిత్రమైన పండుగగా సూర్యుడు తన దిశను మార్చుకుని పుష్యమాసంలో ఉత్తర దిక్కుగా ప్రయాణిస్తాడని అందుకే ఈ మాసమును ఉత్తరాయన పుణ్యకాలంగా గుర్తిస్తారని మహాభారత యుద్ధంలో గాయపడిన భీష్మ పితామహుడు ఈ పుణ్యకాలం వచ్చేవరకు జీవనాన్ని కొనసాగించాడని ముఖ్యంగా దక్షిణ భారతదేశ వాసులు ఈ సంక్రాంతి పండుగను పొంగల్, ఓనం మన తెలుగు వారు సంక్రాంతిగా మూడు రోజులు మొదటి రోజు భోగి రెండవ రోజు సంక్రాంతి మూడవ రోజు కనుమ పండుగగా జరుపుకుంటారు. మొదటిరోజు భోగిమంటలతో మన జీవితం భోగభాగ్యాలతో సుఖంగా ఉండాలని రైతులు పంటలు పండించి ఆ ధాన్యపురాశులు ఇండ్లకు చేరిన సందర్భంగా పాయసంతో పౌశ్యలక్ష్మిని ఆహ్వానిస్తారని సంక్రాంతి మన జీవితాల్లో కొత్త క్రాంతి నిలిపి భావి జీవితం ఆనందంగా గడపాలని మూడవరోజు కనుమ పండుగ కొత్త అల్లుళ్లతో పిల్లాపాపలతో సంతోషంగా జరుపుకొని గాలిపటాలు ఎగరవేస్తారని తెలిపినారు. ఆడపిల్లలు ఇంటిముంగిట రంగవల్లులతో తీర్చిదిద్ది గొబ్బెమ్మలను పెట్టి ఆటపాటలతో ఆనందంగా జరుపుకుంటారని తెలిపినారు. అతిథులు మాట్లాడుతూ మన పాఠశాల విద్యార్థిని విద్యార్థులు చక్కటి ముగ్గులతో గొబ్బెమ్మలతో భోగిమంటలతో భోగిపళ్ళతో సాంప్రదాయ సిద్ధమైనటువంటి సంక్రాంతి పండుగను నూటికి నూరుపాళ్ళు జరుపుకోవడం మాకు అంతులేని అనుభూతిని కలిగించినదని పాఠశాలలో మన భారతీయ సంస్కృతి ,ఆచార సాంప్రదాయాలను విద్యార్థులకు చిన్నప్పటినుండే తెలియజేయడం ద్వారా పాశ్చాత్య పోకడలతో సమాజం కలుషితం కాకుండా కాపాడడం అభినందనీయమని ఇందుకు కృషి చేస్తున్న పాఠశాల ప్రిన్సిపాల్ ని ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసినారు. అనంతరము ప్రిన్సిపాల్ మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మన పాఠశాలలో ప్రతి సంవత్సరం పర్యావరణ మిత్ర యూనిట్ ఆధ్వర్యంలో అనేక పర్యావరణహిత కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అందులో భాగంగానే ఈరోజు సంక్రాంతి పండుగను వినూత్నంగా భోగి మంటలు భోగి పళ్ళు ,కోలాటాలు రంగవల్లులతో అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతున్నదని ఇకముందు కూడా పర్యావరణహిత కార్యక్రమాలు దిగినీకృత ఉత్సాహంతో నిర్వహిస్తామని తెలిపినారు ఈ రంగోలి ముగ్గుల పోటీ కార్యక్రమంలో విజేతలైన విద్యార్థిని విద్యార్థులకు ముఖ్య అతిథులచే బహుమతి ప్రధానం చేయడం జరిగినది .ఈ కార్యక్రమంలో విద్యార్థులు తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరూ పాల్గొన్నారు.