
పయనించే సూర్యుడు జూలై 15 (సూళ్లూరుపేట మండలం రిపోర్టర్, దాసు) :
సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం లో పాల్గొని ప్రజలు చెప్పే సమస్యలకు పరిషాకారం చూపడం లో ఎమ్మెల్యే స్పందన ను ప్రజలు అపూర్వం గా భావిస్తున్నారు. ఈ కార్యక్రమం లో భాగంగా ఎమ్మెల్యే సోమవారం సూళ్లూరుపేట పట్టణం లోని కసారెడ్డి పాలెం లో పర్యటించి ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను కలుసుకున్నారు, ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలను గురించి తెలియజేసారు,ఓట్లు కోసం రాలేదని మీ సమస్యలను తెలుసుకోవటానికి వచ్చానంటూ ఎమ్మెల్యే ప్రజలకు తెలియజేసారు. ప్రజలు ఆమె దృష్టికి తెచ్చిన కొన్ని సమస్యలను
వెంటనే పరిష్కరించే దిశ గా ఆదేశాలు ఇవ్వడం తో ప్రజల నుండి అనుకూల స్పందన వచ్చింది. ఈ కార్యక్రమం లో టిడిపి అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్ రెడ్డి, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆకుతోట రమేష్, కార్యదర్శి AG కిషోర్ , రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు పచ్చవ మాధవ నాయుడు ,టిడిపి నేతలు వాకిచర్ల రమేష్,దంతాల రవి, అలవల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
