
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ జులై 4 అల్లూరి సీతారామరాజు
జిల్లా చింతూరు మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం రంపచోడవరం నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి మిరియాల శిరీష భాస్కర్ గారి ఆదేశాల మేరకు. సుపరిపాలన లో తొలి అడుగు కార్యక్రమం పై బూత్ యూనిట్ . సభ్యులకు అవగాహన సదస్సు నిర్వహించారు ప్రతి బూత్ లోని బూత్ సభ్యులు డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. ప్రతిరోజు 50 ఫోటోలు అప్లోడ్ చేసి టెలిగ్రామ్ బాట్ లోని మై టిడిపి యాప్ లో అప్లోడ్ చేయాలని తెలిపారు ఈ నెల రోజులపాటు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ పార్టీ పని మన పనికి భావించి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని అన్నారు. సుపరిపాలన లో తొలి అడుగు కార్యక్రమం మండలంలో విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఇల్లా చిన్నారెడ్డి క్లస్టర్ ఇంచార్జ్ ఓబిల్లనేని నరసింహారావు కో క్లస్టర్ పొదిలి రామారావు నాయకులు మల్లెల వెంకటేశ్వరరావు యూనిట్ ఇంచార్జ్ లు ముత్యాల శ్రీరామ్ మూర్తి శీలం తమ్మయ్య. బూత్ ఇన్చార్జి లు తదితరులు పాల్గొన్నారు
