
పయనించే సూర్యుడు న్యూస్ జూలై 5(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
కూటమి ప్రభుత్వం ఏడాది పాలన సందర్భంగా “సుపరిపాలనలో తొలి అడుగు” పేరుతో తాడిపత్రి శాసనసభ్యులు జె.సి.అస్మిత్ రెడ్డి గారు మండల తెలుగుదేశం నాయకులతో కలిసి యాడికి పట్టణంలోని ఓంశాంతి కాలనీ నుండి ప్రారంభించారు. ఏడాదిలో ఏం చేశారో భవిష్యత్తులో ఏం చేస్తారో అనే అంశాలను ప్రజలకు వివరించారు. కూటమి నాయకులు, కార్యకర్తలు కరపత్రాలు పంచుతూ ఇంటింటికి తిరిగి సమస్యలు అడిగి తెలుసుకొని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ రుద్రమ నాయుడు, చవ్యా గోపాల్ రెడ్డి,టౌన్ ప్రెసిడెంట్ వెలిగండ్ల ఆదినారాయణ, మాజీ ఎంపీపీ వేలూరి రంగయ్య, చలమారెడ్డి, బొట్టు శేఖర్, మధురాజు, విశ్వనాథ్, గండికోట లక్ష్మణ్, సెల్ పాయింట్ చాంద్ బాషా, ఫైబర్ చందు, ఫిరోజ్ బాషా, మహమ్మద్ రఫీ, కోడూరు నీలకంఠ రెడ్డి తదితర తెలుగుదేశం,బి.జె.పి,జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
