పయనించే సూర్యుడు అక్టోబర్ 10,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
- ప్రజా సంఘాల ఐక్యవేదిక
కోవెలకుంట్ల పట్టణంలోని స్థానిక బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో భారత దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బి ఆర్ గవాయిపై దాడి చేసిన మతోన్మాది రాజేష్ కిషోర్ ను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కేంద్ర ప్రభుత్వానికి వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు ఏం సుధాకర్ ,కరీం భాషా, వెంకటయ్య, వడ్డె సుబ్బరాయుడు, బందేల ఓబులేసు, కత్తి ఓబులేసు లు మాట్లాడుతూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉన్న బిఆర్ గవాయి దళితుడు అనే భావనతో దాడులు చేయడం జరిగిందని ప్రజా సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. బిజెపి ప్రభుత్వం బ్రాహ్మణ ఆధిపత్యంతో మరియు మత ఉన్మాదంతో ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారు అన్నారు .వెనుకబడిన కులాల వారు ఏ ఉన్నత స్థాయిలో ఉన్న వివక్ష చూపుతున్నారు స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు పైబడిన భారతదేశంలో కుల వివక్ష అంటరానితనం కొనసాగుతున్నాయి అన్నారు. ప్రజాస్వామ్యంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తికే ఇలా జరిగితే కిందిస్థాయిలో ఏ విధంగా దాడులు జరుగుతున్నాయో ప్రజలు గుర్తించాలని ఈ దాడికి పాల్పడిన రాజేష్ కిశోర్ ను కఠినంగా శిక్షించాలని లేనిపక్షంలో దేశవ్యాప్త ఉద్యమాలు చేపడతామని వారు అన్నారు ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు నవీన్ రామసుబ్బయ్య దేవరాజు,శేషు నరసింహ, రాముడు, బుజ్జి, తదితరులు పాల్గొన్నారు.


