
పయనించే సూర్యుడు ఆగస్టు 15 (పొనకంటి ఉపేందర్ రావు)
టేకులపల్లి మండలం సులానగర్ గ్రామపంచాయతీలో కార్తీక మాస వనభోజన కార్యక్రమాన్ని కుల పెద్ద ఉండేటి రమేష్ -సుకన్య ఆధ్వర్యంలో ఘనంగా ఘనంగా నిర్వహించారు ఈ వనభోజనాలలో కులాలకు అతీతంగా గ్రామస్తులు బంధువులు, స్నేహితులతో కలసి చెట్ల నీడలో కలసి భోజనం చేశారు, అనంతరం స్నేహితులతో బంధువులతో కలిసి ఆటపాటలు నిర్వహించారు. ఈ సందర్భంగా కుల పెద్ద ఉండేటి రమేష్ మాట్లాడుతూ, కార్తీక వనభోజనాలు ప్రకృతితో మన బంధాన్ని గుర్తుచేసుకునే రోజుగా చెప్పవచ్చు. అసలు కార్తీక మాసం వచ్చిందంటే చాలు ప్రతి ఇంట్లో ఒక ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని ఉంటుంది. ఏడాది కాలంలో ఎప్పుడు కుదిరినా కుదరక పోయినా బంధుమిత్రులతో కలిసి కొంత సమయం గడింపేందుకు వనభోజనాలు గొప్ప సందర్భంగా మారింది వారు తెలియజేశారు. ఈ కార్తీక వనభోజనాల సందర్భంగా బంధుమిత్రులతో గ్రామములో పండగ వాతావరణం సంతరించుకుంది. కుల మతాలకతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొని ఆలింగనం చేసుకున్నారు. అనంతరం చిన్నారులు డాన్సులు సందడి చేసి అనేకులను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో బంధువులు స్నేహితులు రక్త సంబంధులు పాల్గొన్నారు.