
పయనించే సూర్యుడు ఆగస్టు 7 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
తిమ్మరావుపేట సర్కిల్ అంగన్వాడీ టీచర్స్ ఈరోజు అనగా 07/08/2025 ఖమ్మం జిల్లా కలెక్టర్ గారిని కలిసి తిమ్మరావుపేట సర్కిల్లో వేధిస్తుంది అన్న వార్త నిజం కాదని తిమ్మరావుపేట సర్కిల్ టీచర్స్ వినతి పత్రం ఇవ్వనైనది. గత కొంతకాలంగా తిమ్మారావుపేట సర్కిల్లో. అంగన్వాడీ టీచర్స్ అయినా.. ఈ. పారిజాతం, జి. శిరోమణి . అంగన్వాడి టీచర్స్ ని వేధిస్తుందని ఆరోపించిన ఆరోపణ నిజం కాదు అని ఆ ఇద్దరు టీచర్స్ సెంటర్స్ ఓపెన్ చేయకుండా సూపర్వైజర్ పర్మిషన్ ఇవ్వటం లేదని అబద్ధం చెప్తూ వారికి అనుకూలంగా ఉన్న యూనియన్ లో చేరాలని సర్కిల్ లో టీచర్స్ పై వత్తిడి తెస్తూ రాత్రి సమయంలో ఆటోలో వచ్చి అంగన్వాడి టీచర్స్ ఇళ్లకు తిరుగుతూ ప్రతిరోజు అంగన్వాడి సెంటర్ నిర్వహించాలని చెప్పిన సూపర్వైజర్ పై కక్ష గట్టి పేపర్లలో వార్తలు వేస్తున్నారు ఈ విషయంపై మిగతా టీచర్స్ అందరికీ మరియు సర్కిల్ కి చెడ్డ పేరు రావడమే కాకుండా విధులను నిర్వహించలేకపోతున్నాం కాబట్టి ఈ విషయమై సత్వర పరిష్కారం చూపెట్టి సెంటర్ సజావుగా నిర్వహించుటకు సహకరించగలరని జిల్లా కలెక్టర్ గారిని మరియు డి డబ్ల్యు ఓ పిడి గారిని కలిసి వినతి పత్రం ఇవ్వనైనది . పిడి గారిని కలసి సుజాత. భద్రకాళి. ఆంధ్రా వాణి. నరసమ్మ. సుమిత్ర. విజయలక్ష్మి వినతి పత్రం అందించడం జరిగింది
