పయనించే సూర్యుడు అక్టోబర్ 30 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు)
సూళ్లూరుపేట జనసేన పార్టీb నాయకులు ఆధ్వర్యంలో నాగబాబు జన్మదిన వేడుకలు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి,శాసనమండలి సభ్యులు,మెగాఫ్యామిలీ అభిమానుల రథ సారథి కొణిదెల నాగబాబు జన్మదిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ బాబు సూచనలు మేరకు సూళ్లూరుపేట నియోజకవర్గంలో తడ మండలంలోని అనపగుంట గిరిజన కాలనీలో 56 కుటుంబాలకు దుప్పట్లు, బిస్కెట్లు పంపిణీ చేయడం జరిగినది. సూళ్లూరుపేట జనసేన పార్టీ నాయకులు మాభాష మాట్లాడుతూ నాగబాబు కి మా అశేష మెగాభిమానులు. జనసైనికుల తరపున నిండు మనసులతో హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నాగేంద్ర బాబు ప్రయాణంలో మరిన్ని మజిలీలు చేరుకోవాలని ప్రజాక్షేత్రంలో ప్రజామన్ననలు గెలవాలని ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్నారు కార్యక్రమలో జనసేన పార్టీ నాయకులు నక్క హరిబాబు,కోటి యాదవ్, ఆవుల దాస్, శంకు సురేష్, చేనీ సూరి, వీర మహిళలు పద్మజ సుజాత తడ మండల జనసేన సైనికులు సూర్య, మనీ, సాయి, పాల్గొన్నారు

