పయమించే సూర్యుడు అక్టోబర్ 28 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు )
సూళ్లూరుపేట పురపాలక సంఘం పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మొంథా తుఫాను నేపథ్యంలో విస్తారంగా కురుస్తున్న వర్షాల పట్ల ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మున్సిపల్ చైర్ పర్సన్ ధబ్బల శ్రీమంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.మొంథా తుఫాను కారణంగా గంటకు 100 కిలోమీటర్ల వేగముతో గాలి వీస్తుంది అని గౌరవ కమిషనర్ & డైరెక్టరేట్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారి ఆదేశాలు మేరకు పురపాలక సంఘ పరిధిలో గల అన్ని వీధులలో హోర్డింగ్ మరియు ఫ్లెక్సీలు టౌన్ ప్లానింగ్ సిబ్బందిచే తొలగించడం జరిగినది.పట్టణంలో తుఫాను వల్ల లోతట్టు ప్రాంతాల్లో నీటినీ నిలవలేకుంట డి-వాటరింగ్ మోటర్లు పురపాలక ఇంజనీరింగ్ సిబ్బందిచే తొలగించడం జరిగినది.పట్టణంలో తుఫాను వల్ల పళ్ళు ప్రాంతాలలో డ్రైనేజ్ నీటిని నిలవలేకుంట జె.సి.బి తో పురపాలక పారిశుధ్య సిబ్బందిచే కాలువ పూడికను తొలగించడం జరిగినది.పట్టణంలో ప్రజలకు తుఫాను ఇబ్బందికి సూళ్లూరుపేట జెడ్.పి.గర్ల్స్ హై స్కూల్ నందు పునరావాసం కేంద్రం ఏర్పాటు చేయడం జరిగినది. పునరావాసం కేంద్రం నందు భోజనం, తాగునీరు తదితర సదుపాయాలు ఏర్పాటు చేసియున్నారు.
పట్టణంలో తుఫానుకు ముందస్తు చర్యగా పురపాలక ప్లానింగ్ సిబ్బందిచే శిథిలావస్థకు చేరుకున్న భవనాలకు నోటీస్ జారీ చేయడం జరిగింది. ఇంకను అటువంటి భవనాలలో నివసిస్తున ప్రజలు ఉనచో జెడ్.పి.గర్ల్స్ హై స్కూల్ నందు పునరావాసం కేంద్రం ఉపయోగించూ కోవాల్సిందిగా తెలియజేయడమైనది.
అదేవిధంగా వర్షాభావ పరిస్థితుల వలన సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా కాచి చల్లార్చిన నీటిని తాగవలసిందిగా తెలియజేయడమైనది.
అటులనే పట్టణంలో తుఫాను వల్ల ఎటువంటి సమస్య ఉన్నచో కాల్ సెంటర్ నెంబరు 08623-295456 కు తెలిపిన వెంటనే పరిష్కరించడం జరుగుతుంది అని సూళ్లూరుపేట మున్సిపల్ కమిషనర్ కె. చిన్నయ్య తెలిపారు.ఈ కార్యక్రమంలో భాగముగా పురపాలక సంఘం నందు డి-వాటరింగ్ మోటర్లు పనితీరు మరియు పురపాలక సంఘం లో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ ను పరిశీలించారు


