
పయనించే సూర్యుడు అక్టోబర్ 17 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు )
సూళ్లూరుపేట మున్సిపల్ కమీషనర్ కి ఒక విన్నపము… ఈమధ్య కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ 2.0 తగ్గింపును ఒక పండుగలా చేసుకోవాలని పిలుపునిస్తే ఆ పిలుపునకు మద్దతుగా స్థానిక శాసన సభ్యురాలు విజయశ్రీ మరియు కమిషనర్ కలసి సూళ్లూరుపేట వ్యాపార సంఘాలను పిలిచి వారితో కలసి వారికి జీఎస్టీ 2.0 మీద అవగాహన కార్యక్రమాన్ని అట్టహాసం గా నిర్వహించారు కానీ సూళ్లూరుపేట దుకాణాల లో ఎక్కడ కూడా ధరల పట్టిక అనేది కంటికి కన బడటం లేదు ఈ విషయా న్ని కమిషనర్ గమ నించారో లేదో వ్యాపార స్తులు మాత్రం జిఎస్టి 2.0 తగ్గిన విషయాన్ని ప్రజలకు చెప్ప డం లేదు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.. మరి సూళ్లూరుపేటలో ఈ మధ్యకాలంలో సూపర్ మార్కె ట్లు ప్రారంభమై దిగ్విజయంగా నడుస్తున్నాయి కానీ ఇక్కడ ధరల పట్టిక లేదు తూకం తక్కువ ఉందన్న ఫిర్యాదులు వస్తున్నాయి. {నేషనల్ మెట్రాలజీ యాక్ట్ 2009,మరియు కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019, కొనుగోలుదారుల రక్షణార్థం ప్రతి దుకాణంలో ధరల పట్టిక ఉండవల సిందే అంటూన్నది.. ఆ ధరల పట్టికలో ఒక కిలో ఎంత 100 గ్రాముల ధర ఎంత అని వివరంగా వ్రాసి ఉండాలని కూడా సూచిస్తు న్నది} కావున దయచేసి వ్యాపారస్తులందరికీ ఈ విషయాన్ని మీరు తెలియజేసి వారి చేత ఆ ధరలు పట్టిక కార్యక్రమాన్ని పూర్తి చేయిస్తారని ప్రజలు కోరుకుం టున్నారు
