
పయనించే సూర్యుడు జూలై 23 (సూళ్లూరుపేట మండలం రిపోర్టర్, దాసు) :
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు మేరకు నేడు సూళ్లూరుపేట పట్టణ పరిధిలోని సూళ్లూరు మరియు నాగరాజపురం నందు సుపరిపాలనలో తొలి అడుగు అన్నే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సూళ్లూరుపేట నియోజకవర్గ శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ ,తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్ రెడ్డి , సూళ్లూరుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుతోట రమేష్ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా సూళ్లూరు మరియు నాగరాజపురం లోని ప్రతి గడపకు వెళ్లి కూటమి ప్రభుత్వంఅందిస్తున్న పధకాలను వివరించి,వార్డులోని ప్రజల సమస్యలను తెలుసుకుని,వాటిని సత్వరమే పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 8వ వార్డ్ కౌన్సిలర్ ఈదూరు చెంగమ్మ, ఈదూరు వెంకటస్వామి ,బూత్ ఇంచార్జ్ పూరి చెంగయ్య ,9వ వార్డు బూత్ ఇంచార్జ్ కాతారి మునస్వామి ,తెలుగుదేశం పార్టీ యువనాయకులు కట్టబోయిన వెంకటేష్ యాదవ్ నియోజకవర్గ నాయి బ్రాహ్మణ సమితి అధ్యక్షులు రేబూరు హరీష్ ,TNSUF సూళ్లూరుపేట అధ్యక్షులు ఎర్రబోతు ప్రశాంత్ తెలుగు యువత సభ్యులు బాబు,షాలీమ్,జీవన్, అశోక్,పృథ్వి రాజ్,హరి బాబు,యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.
