
పయనించే సూర్యుడు న్యూస్// నారాయణపేట జిల్లా మక్తల్ నియోజవర్గం 1, 4 2025 మంగళవారం
హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలి శివారులో సర్వే.నం 25 లోని 400 ఎకరాల భూమిపై రాష్ట్ర ప్రభుత్వం రాజకీయం చేస్తుందని బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు పీకే.నరసింహ ఆరోపించాడు అర్ధరాత్రి బుల్డోజర్లతో చెట్లను నరుకుతుంటే నెమలుల ఆర్తనాదాలు హృదయవిదారకంగా ఉన్నాయని యూనివర్సిటీ భూముల పరిరక్షణ కోసం పాటుపడుతున్న విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వ అణిచివేతకు పాల్పడుతుందని దీనిని అడ్డుకున్న ఏబీవీపీ నాయకులను అక్రమ అరెస్టులకు పాల్పడిందని మరియు హైదరాబాద్ కు ఊపిరినిచ్చే కొన్ని గ్రీన్ ప్రాంతాలలో సెంట్రల్ యూనివర్సిటీ మరియు దాని చుట్టూ ఉన్న ప్రాంతాలేనని ప్రభుత్వం గుర్తించాలని మరియు వన్యప్రాణి సంరక్షణ అనే పదాన్ని తుంగలో తొక్కి అడ్డగోలు హామీలను ఇచ్చి వాటిని నెరవేర్చడంలో విపాలమైందన్నారు ఆరు గ్యారెంటీల ముచ్చటను అటకెక్కించి విద్యార్థులపై అవలంబిస్తున్న తీరు దుర్మార్గమని దీనిని బీజేవైఎం మక్తల్ శాఖ తీవ్రంగా కండిస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆస్తులు అమ్మడం అప్పులను తీసుకురావడమే తమ ఏజెండాగా పెట్టుకున్నట్టు ప్రజలు ఆలోచిస్తున్నారని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ హెచ్.సి.యు కు రెండుసార్లు వచ్చి వెళ్లిన దాంట్లో అంతరయ్యాన్ని ప్రజలు గమనిస్తున్నారని. ఇలా గ్రీన్ ప్రాంతాలను అమ్ముకుంటూ పోతే ఢిల్లీ తరహా భవిష్యత్తులో పక్షిమ హైదరాబాద్ లో ఊపిరి పీల్చుకోవడం కష్టమవుతుందని తక్షణమే ప్రభుత్వం నిర్ణయన్ని మానుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కుర్వలింగం రాజగౌడ్ బ్యాటరీ రాజు తదితరులు పాల్గొన్నారు