జనం న్యూస్ జనవరి 27 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి:- బిఆర్ టియు రాష్ట్ర కార్మిక నాయకుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత రవిసింగ్. కూకట్ పల్లి నియోజకవర్గంలోని కూకట్ పల్లి ఇండస్ట్రీ పరిధిలోని “గ్లాడియేటర్ ప్రైవేట్ లిమిటెడ్ సెక్యూరిటీ కాంటాక్ట్ ఆఫీస్”హౌసింగ్ బోర్డ్, లులు మాల్ లో సెక్యూరిటీ గార్డ్ గా గత కొన్ని సంవత్సరాల నుంచి పని చేస్తున్నా, అబ్బాస్ సెక్యూరిటీ కార్మికుడు… అబ్బాస్ కొన్ని అనివార్య కారణాలవల్ల డ్యూటీ మానేయడం జరిగింది… సెక్యూరిటీ గార్డ్ అబ్బాస్ కు రావలసిన గత సంవత్సరం నవంబర్ నెల వేత్తనం ఇవ్వాల్సి ఉండగా గ్లాడియేటర్ ప్రైవేట్ లిమిటెడ్ సెక్యూరిటీ కాంటాక్ట్, వేత్తనం ఇవ్వకుండా దుర్భాషలాడి సెక్యూరిటీ గార్డ్ ను బెదిరించి పంపించేవాడు సెక్యూరిటీ కార్మికునికి ఏం చేయాలో అర్ధం కాక ఎవరైతే మనకు న్యాయం చేస్తారో అని తోటి సెక్యూరిటీ మిత్రులు ద్వారా తెలుసుకొని, బిఆర్ టియు రాష్ట్ర కార్మిక నాయకుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత రవిసింగ్ కార్యాలయం వద్దకు వెళ్లి సెక్యూరిటీ గార్డ్ కి జరిగిన అన్యాయం గురించి చెప్పారు, ఆ తర్వాత వెంటనే స్పందించిన కార్మిక నాయకుడు రవిసింగ్ హుటాహుటిన గ్లాడియేటర్ ప్రైవేట్ లిమిటెడ్ సెక్యూరిటీ మేనేజ్ మెంట్ దగ్గరికి వెళ్లి సెక్యూరిటీ కార్మికుడికి గత సంవత్సరం నవంబర్ నెల వేత్తనం రావాల్సి ఉండగా వెంటనే మాట్లాడి, సెక్యూరిటీ గార్డ్ అబ్బాస్ కు రావాల్సిన వేత్తనం ఇప్పించడం జరిగింది… సెక్యూరిటీ గార్డ్ అబ్బాస్ మాట్లాడుతూ నాకు న్యాయం చేసిన కార్మిక నాయకుడు రవిసింగ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు…ఈ కార్యక్రమంలో అనిల్, సుదర్శన్, జగన్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు..
సెక్యూరిటీ గార్డ్ కార్మికునికి రావలసిన వేత్తనం ఇప్పించిన రవిసింగ్
RELATED ARTICLES