
ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి రాగాళ్ల ఉపేందర్ మాదిగ
ఎమ్మార్పీఎస్ ఫరూక్నగర్ అధ్యక్షులు జోగు నాగభూషణం
( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 3 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
వికలాంగుల పెన్షన్లు రూ.6000కు పెంచాలని మరియు మొత్తం చేయూత పెన్షన్ దారుల పెన్షన్లు రూ 4000 పెంచాలని డిమాండ్ చేస్తూ మంద కృష్ణ మాదిగ నడుపుతున్న మానవీయ ఉద్యమంలో భాగంగా ఫరూక్ నగర్ మండలం కంసాన్ పల్లి గ్రామంలోనీ గ్రామ పంచాయతీ ఆవరణలో చేయూత పెన్షన్ దారుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా ఇంచార్జి రాగళ్ల ఉపేందర్ మాదిగ పాల్గొని ప్రసంగించారు .ఈసమావేశాన్ని ఎమ్మార్పీఎస్ ఫరూక్ నగర్ మండల అధ్యక్షులు జోగు నాగభూషణం మాదిగ, మండల నాయకులు కళ్లేపల్లి బాలరాజు మాదిగ, బొబ్బిలి పాండు మాదిగలు సమన్వయం చేశారు.ఈనెల 8న మధ్యాహ్నం షాద్ నగర్ గౌరీ ఫంక్షన్ హాల్ నందు జరిగే కార్యక్రమానికి మందకృష్ణ మాదిగ ముఖ్యఅతిథిగా పాల్గొంటారన్నారు. వికలాంగులు మరియు చేయూత పెన్షన్ దారుల సన్నాహక మహాసభకు పెన్షన్ దారులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరడం జరిగింది.
