
పయనించే సూర్యుడు ఆగస్టు 18 (పొనకంటి ఉపేందర్ రావు)
టేకులపల్లి :జగదాంబ సేవాలల్ బుడియా బాపు గిరిజన సేవా సంఘ్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు అంగోతు రాజు సాదు ఆధ్వర్యంలో కలెక్టర్ సేవాలాల్ జయంతి కొరకు ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులను నేరుగా బంజారా పూజారులకు సాధుసంతులకు గురువులకు చెందే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సేవాలాల్ జయంతి దేశవ్యాప్తంగా ఎంతో అంగరంగ వైభవంగా సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా జరుపుకుంటున్న విషయం తెలిసిందే అయితే ఎవరైతే ఆలయాల వద్ద సేవాలాల్ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తారు భోగ్ బండారో కార్యక్రమాలు చేస్తారో వారిని గుర్తించి ఆ నిధులను బంజారా పూజారులకు సాధుసంతులకు చెందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షులు రాములు మహరాజ్, రాష్ట్ర అధ్యక్షులు గణేష్ మహారాజ్, తెలంగాణ సాధువుల రాష్ట్ర అధ్యక్షులు శంకర్ సాదు , రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సురేష్ స్వామి, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ దరవత్ కృష్ణ నాయక్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రమేష్ స్వామి, జిల్లా ప్రచార కార్యదర్శి బాలు సాదు, రాందాస్ సాదు, రాంఫాల్ సాదు, సీతారాం సాదు తదితరులు పాల్గొన్నారు.