
పయనించే సూర్యుడు ఆగస్టు 16 (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి :జగదాంబ సేవాలాల్ బుడియా బాపు గిరిజన సేవా సంఘ్ ఆధ్వర్యంలో సోమవారం నాడు ఉదయం 9:30 కు మహబూబాబాద్ రావాలని వ్యవస్థాపక అధ్యక్షులు తేజావత్ రాములు మహారాజ్ తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. మహబూబాద్ జిల్లా కలెక్టర్ కి సేవాలాల్ జయంతి ఉత్సవాలకు ప్రభుత్వం ఇస్తున్న నిధులను బంజారా పూజారులకు ఇవ్వాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ ప్రజావాణిలో మెమోరండం ఇవ్వడానికి మహబూబాద్ జిల్లా వాసులు, బంజారా గురువులు,సాధువులు, పూజారులు, అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని జగదాంబ సేవాలాల్ బుడియా బాపు గిరిజన సేవా సంఘ్ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సురేష్ స్వామి పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు గణేష్ మహారాజ్, తెలంగాణ రాష్ట్ర సాధువుల అధ్యక్షులు నూనావత్ శంకర్ సాదు ,రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ దరవత్ కృష్ణ నాయక్ , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి గురు ప్రసాద్ సాధు తదితరులు పాల్గొన్నారు.