
ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సహకారంతో సేవాలాల్ గుడి వద్ద విద్యుత్ ఏర్పాట్లు
మాజీ సర్పంచ్ బుజ్జి రాజు నాయక్ ఆధ్వర్యంలో పనులు పూర్తి
హర్షం వ్యక్తం చేస్తున్న తండా ప్రజలు
( పయనించే సూర్యుడు అక్టోబర్ 06 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
ఫరూక్నగర్ మండల పరిధిలోని కడియాల కుంట తండాలో ఇటీవలే నూతనంగా నిర్మించిన సేవాలాల్ మరియు మేరమ యాడి గుడి వద్ద కరెంటు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరెంటు తోపాటు బోరు మోటర్ నీళ్లు నిత్యం అందు బాటులో ఉండే విధంగా కరెంటు ఏర్పాటు చేయాలని గ్రామ ప్రజలు మరియు తాండ మాజీ సర్పంచ్ బుచ్చి రాజు నాయక్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. స్పందించిన ఎమ్మెల్యే తన తన సహాయ సహకారాలు పండగ ప్రజలకు ఎల్లవేళలా ఉంటాయని భరోసా ఇస్తూ, తన సహకారంతో గుడి వద్ద కరెంటు బుడ్డిని ఏర్పాటు చేయించడం జరిగింది. గుడి నిర్మించిన సరిగ్గా కరెంటు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న తండా ప్రజలు ఈరోజు కరెంటు ఏర్పాటు చేయడంతో తండా ప్రజలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తావ్ సింగ్ , సేవ్య , శంకర్ , రెడ్యా, మోహన్ ,రాజు ,రవి నాయక్, తావ్ సింగ్, గోపి, రమేష్ రాథోడ్,తదితరులు పాల్గొన్నారు.
