
ఆయనేంచే సూర్యుడు బాపట్ల ఫిబ్రవరి 22:- రిపోర్టర్ (కే. శివ కృష్ణ ) బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి బాపట్ల జిల్లా: సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి సూచించారు.గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… బాపట్ల జిల్లా చీరాలలో ప్రభుత్వ పథకాల పేరుతో భారీ స్కాం కు తెరతీయగా,ఫిర్యాదు అందుకుని రంగంలోకి దిగి లోతైన దర్యాప్తు చేశామని తెలిపారు. గర్భిణీలకు, బిడ్డతల్లులకి కేంద్ర ప్రభుత్వం ద్వారా రూ.2లక్షలు వస్తాయని నమ్మబలికి, లింక్ పంపి మోసాలకు పాల్పడిన ముఠా… ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని, డిల్లీ కేంద్రంగా మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు చేసిన బాపట్ల జిల్లా పోలీసులను అభినందించారు. ఈ కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని, తదుపరి విచారణ జరుగుతోందని ఎస్పీ తుషార్ డూడి తెలిపారు.