
ప్రజలకు అవగాహన కల్పిస్తున్న పోలీసులు..
రుద్రూర్, మే 17 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :
రుద్రూర్ మండలంలోని అంబం(ఆర్) గ్రామంలో రుద్రూర్ పోలీసుల ఆధ్వర్యంలో శనివారం హనుమాన్ మందిరం వద్ద సీపీ ఆదేశాల మేరకు వాహనదారులకు రుద్రూర్ ఎస్సై సాయన్న అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరు వాహనం నడిపే సమయంలో తప్పనిసరిగా హెల్మెంట్ ధరించాలని సూచించారు. ప్రస్తుతం ఆన్లైన్ వేదికగా సైబర్ నేరాలు జరుగుతున్నాయని యువకులు అలైన్ బెట్టింగ్ లకు బానిసవుతున్నారని డబ్బులు పోగొట్టుకొని ఆత్మహత్య లు చేసుకుంటున్నారని అన్నారు. అలాంటి చెడు అలవాటుకు యువత దూరంగా ఉండాలంటే ఇంట్లో తల్లిదండ్రులు క్రమ శిక్షణగా పెంచాలన్నారు. ఓ టీ పీ ద్వారా కూడా సైబర్ నేరాలు జరుగుతున్నాయని. మీ ఫోన్ కు ఓ టీ పీ వచ్చిందని సైబర్ నేరగాళ్లు వలలో వేసుకొని నెంబర్ చెప్పగానే మీ బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బులు అన్ని కాజేస్తారని అందుకోసం ఎవరుకూడా ఓ టీ పీ చెప్పవద్దని సూచించారు. ఆదివారం రుద్రూర్ మండల కేంద్రంలో ట్రాఫిక్ రూల్స్ పై పెద్ద ఎత్తున ర్యాలీ ఉంటుందని ప్రతి ఒక్కరు పాల్గొనాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు రేంజర్ల గంగారాం,పెద్దలు ఆర్.సాయిలు,లింగం, చిట్టి బాబు, పోలీస్ సిబ్బంది సురేష్,రాజు, గజేందర్ తదితరలు ఉన్నారు.