
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా భీమ్గల్ మున్సిపల్ పరిధిలో
తేదీ 15 అక్టోబర్ 2025 ఉదయము ప్రభుత్వ జూనియర్ కళాశాల భీమ్గల్ లో స్టూడెంట్స్ కౌన్సిలింగ్ కార్యక్రమంలో భాగంగా కౌన్సిలర్లు ఈరోజు బుధవారం రోజున సైబర్ సురక్ష జాతీయ భద్రత మరియు మత్తుపదార్థాల నివారణ కార్యక్రమము జరిగింది ఇట్టి కార్యక్రమంలో భాగంగా రక్షణ శాఖ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కే సందీప్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థుల దశలో ఏం చేయాలో ఎలా ఉండాలో గందరగోళమునకు సతమవుతమవుతున్నటువంటి దశ ఈ వయసులో మిమ్మల్ని ఆకట్టుకునే మత్తు పదార్థాలైన గంజాయి మరియు మద్యం వంటి మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా మిమ్మల్ని మీరు అదుపులో ఉంచుకుంటూ మీ యొక్క ఏకాగ్రతను చదువుపట్లనే దృష్టి సారించాలి. కానీ ఇతర ఇటువంటి మాదకద్రవ్యాల బారిన పడకుండా మీ జీవితాలను వ్యర్ధంగా గడపకుండా బంగారు భవిష్యత్తును బానిస బ్రతుకుగా మార్చుకోకుండా మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవాలి. తప్ప ఎటువంటి తప్పుడు పనులకు చోటు ఇవ్వకుండా అలాగే సైబరు నేరాల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ మీ జీవితాలను సక్రమమైన మార్గంలో నడిపించుకుంటూ కేవలము విద్యను అభ్యసించి రాబోయే రోజుల్లో మంచి స్థితిలో మీరు రాణించాలి కానీ ఎటువంటి దురలవాట్లకు అలవాటు పడకూడదు అని మాట్లాడినారు. ఇట్టి కార్యక్రమంలో ఏఎస్ఐ అబ్దుల్ సత్తార్ కూడా అమూల్యమైన సందేశం ఇచ్చారు. అబ్దుల్ సత్తార్ మాట్లాడుతూ విద్యార్థులకు పలు సూచనలు చేస్తూ ఏలాంటి నేరాలు చేయకుండా, ఆన్లైన్ గేమ్స్ కు అలవాటు పడకుండా మరియు సైబర్ నేరాలను తమ దరికి రానీయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పినారు. ఇందులో భాగంగా స్టూడెంట్స్ కౌన్సిలర్స్ డాక్టర్ మండలోజు నర్సింహ స్వామి మరియు పల్లె శ్రీనివాస్ గౌడ్ విద్యార్థులకు పలు విషయాలపైన అవగాహన కల్పించారు ఇందులో భాగంగా కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ జాడే సత్యనారాయణ మాట్లాడుతూ ఎవరు కూడా బైకుల పైన ముగ్గురు ఎక్కి వెళ్ళకూడదు మరియు కళాశాలకు క్రమం తప్పకుండా హాజరై ఏ విధమైన మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా విద్య పైననే దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రక్షక శాఖ సిబ్బంది మరియు కళాశాల అధ్యాపక బృందము విద్యార్థిని విద్యార్థులు పాల్గొని విజయవంతం చేశారు
