
పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 4 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి
ఆటలాడుతూ ఒకరు..డ్యాన్స్ వేస్తూ మరొకరు..అప్పటివరకు అందరితో నవ్వుకుంటూ మాట్లాడుతూ ఇంకొకరు..పనిచేస్తూ మరికొందరు..ఇలా చాలా మంది అకస్మాత్తుగా ప్రాణాలు విడుస్తున్నారు..అసలు యువకులలో ఆకస్మిక మరణానికి కారణమేమిటి..అనే విషయంపై ఇప్పటికీ ఆందోళన నెలకొంది..
అయితే.. గుండె పోటు (మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్), కార్డియాక్ అరెస్ట్.. లాంటివి యువకుల ప్రాణాలు తీస్తున్నాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.
ఒకప్పుడు వృద్ధులలో కనిపించే ఈ గుండె జబ్బుల సమస్యలు.. ఇప్పుడు చిన్నా.. పెద్దా అనే తేడా లేకుండా ప్రాణాలు తీస్తున్నాయి..అయితే.. యువకులలో ఆకస్మిక మరణానికి కారణమేమిటి అనే విషయంపై పోస్ట్‌మార్టం నిపుణులు పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.గుండె పోటు కేసులు యువకులలో పెరుగుతుండటంతో.. గుండెజబ్బులు చిన్న వయస్సులోనే ఎందుకు వస్తున్నాయి..? దానికి కారణం ఏంటన్న సందేహం తరచూ కలుగుతుంది.. అయితే, శరీరం నుండి వచ్చే ముందస్తు హెచ్చరిక సంకేతాలను తరచుగా విస్మరించడం వల్లే ఈ మరణాలు ఎక్కువగా