పయనించే సూర్యుడు న్యూస్ :ఫిబ్రవరి 1అనంతసాగరం మండలం, నెల్లూరు జిల్లా (రిపోర్టర్: వెంకటరమణారెడ్డి)
అనంతసాగరం మండలం సోమశిల గ్రామంలోని హిల్ కాలనీలో శ్రీ కామాక్షి సమేత సోమేశ్వర ఆలయ ప్రధాన అర్చకులు రామకృష్ణ శర్మ గృహప్రవేశం ఘనంగా జరిగినది. శుక్రవారం రాత్రి 9:30 కు సాంప్రదాయ పద్ధతిలో ప్రత్యేక పూజలు నిర్వహించి గృహప్రవేశం చేశారు.శనివారం ఉదయం అన్నవరపు రామకృష్ణ శర్మ, భార్గవి దంపతులు బ్రహ్మశ్రీ సత్యనారాయణ స్వామి శర్మ ఆధ్వర్యంలో సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించి దంపతులను ఆయన ఆశీర్వదించారు. గృహప్రవేశానికి వచ్చిన వారికి రామకృష్ణ శర్మ దంపతులు ప్రత్యేకంగా బహుమతులు అందజేశారు. అనంతరం విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. కుటుంబ సమేతంగా విచ్చేసిన వారు తాంబూలాలు స్వీకరించారు. అనంతరం విందును ఏర్పాటు చేశారు. నూతన గృహం చుట్టూ విద్యుత్ అలంకరణ చేశారు. ఈ కార్యక్రమంలో సోమశిల శ్రీ కామాక్షి సమేత శివాలయం వంశపార ధర్మకర్తలు ఉప్పల సోమసుందరమూర్తి, కలవాయి మండలం జడ్పిటిసి సభ్యులు అనిల్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం నాయకులు మునగపాటి సుబ్బరాజు, కొండ్రెడ్డి రామిరెడ్డి, జంజం నారాయణ, సుంకర వెంకటసుబ్బయ్య,అబ్దుల్ రెహమాన్, పెరుమాళ్ళ రవికుమార్, రసూల్. ఉత్తర కాలవ నీటి సంఘం అధ్యక్షులు పెంచల ప్రసాద్ నాయుడు, పడమటి ఖమ్మంపాడు ఇసుక రీచ్ ఓనర్ బుజ్జి నాయుడు, రమేష్ నాయుడు, అనంతసాగరం మండలం వైకాపా క్రిస్టియన్ కన్వీనర్ కోడి నాగ శేషు, వైకాపా నాయకులు గుండు బోయిన ఈశ్వరయ్య, గుండు బోయిన వెంకటరమణ, ముక్కు మస్తాన్ గౌడ్, గుండు బోయిన కృష్ణయ్య, పెరుమాళ్ళ పెంచలయ్య, వ్యాపారస్తులు అమర సురేష్, తదితరులు పాల్గొన్నారు.