
పయనించే సూర్యుడు ఏప్రిల్ 29 టేకులపల్లి ప్రతినిధి పోనకంటి ఉపేందర్ రావు
టేకులపల్లి మండలం “పాత లచ్చగూడెం” గ్రామానికి చెందిన కొమరం సునీల్ – సునీత కుమారుడు చందుకిషోర్ఇంటర్ పరీక్షల్లో 953మార్కులతో స్టేట్ ర్యాంక్ సాధించిన సందర్బంగా కేక్ తినిపిస్తూ శాలువాతో సత్కరించి అభినందనలు తెలియచేసిన ఇల్లందు నియోజకవర్గ నాయకులు “కోరం సురేందర్” ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఒక ఆదివాసీ బిడ్డ స్టేట్ ర్యాంక్ సాధించి తల్లి తండ్రులకు, గ్రామానికి పేరు తేవటం చాలా గర్వకారణంగా ఉందని విద్యార్థికి ఉన్నత చదువులకు తమవంతు సహకారాన్ని అందిస్తానని హామీ ఇవ్వటం జరిగినది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.