- నోముల భానుచందర్ పి వై ఎల్ రాష్ట్ర సహాయ కార్యదర్శి
పయనించే సూర్యుడు అక్టోబర్ 24 (పొనకంటి ఉపేందర్ రావు)
టేకులపల్లి: శుక్రవారం తెలంగాణ రాష్ట్రం లో స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే నిర్వహించి గ్రామాలను అభివృద్ధి చేయలని ప్రగతిశీల యువజన సంఘం PYL తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి నోముల భానుచందర్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల గడువు ముగిసిన దాదాపు రెండు సంవత్సరాలు కావస్తోంది . అయినా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించక పోవడం ద్వారా రాష్ట్రం లో గ్రామాల్లో ఎక్కడ పరిశుద్ధం అక్కడే పేరుకుపోయిన దుస్థితి ఈ రోజు తెలంగాణ రాష్ట్రం లో ఏర్పడింది కనుక రిజర్వేషన్ సమస్య ను వెంటనే పరిష్కారం అయ్యే విధం ప్రయత్నం చేయాలి. లేకుంటే పాత పద్ధతుల్లో నే ఎన్నికలు వెంటనే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ను కోరడం జరిగింది. గ్రామలు అభివృద్ధి చెందిన అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది. అప్పుడే ఈ దేశం అభివృద్ధి పథం లో ముందు సాగుతుందని అయన అన్నారు.ఎన్నికలు నిర్వహించకపోడం ద్వారా గ్రామ పంచాయతీ లకు రావలసిన రాష్ట్ర ఫండ్, కేంద్ర ఫండ్ రాకపోవడం ద్వారా గ్రామాల్లో సరియైన లైట్లు,బ్లీచింగ్,కాలువ పనులు అనేక సమస్యలతో గ్రామాలు ఉన్నాయి కనుక స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెంటనే విడుదలచేసిఎన్నికలునిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వంని కోరడం జరిగింది.

