
పయనించే సూర్యుడు అక్టోబర్ 03 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
ఏన్కూర్: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏన్కుర్ మండలంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ) అభ్యర్థులు పోటీ చేస్తారని సీపీఐ మండల కార్యదర్శి జాగర్లమూడి రంజిత్ కుమార్ పేర్కొన్నారు. ఏన్కూరు లో ముఖ్య కార్యకర్తల సమావేశం భానోత్ రాంబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జాగర్లమూడి రంజిత్ కుమార్ మాట్లాడుతూ ఏన్కుర్ మండలంలో జడ్పీటీసీ తో పాటు బలమున్న అన్ని ఎంపీటీసీ స్థానాల్లో సీపీఐ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని తెలిపారు. కలిసొచ్చే పార్టీలతో పొత్తు అవగాహనతో ముందుకెళ్తామన్నారు. సీపీఐ పార్టీ అభ్యర్థులను ప్రజలు గెలిపించాలని కోరారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ) దేశంలో ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా డిసెంబర్ నెలలో ముగింపు ఉత్సవాలు ఖమ్మంలో జరుగుతాయని దానికి దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు పాల్గొంటున్నారని దాని జయప్రదానికి ఈ నెల 5 న ఖమ్మంలోని సన్నాహక సమావేశం యస్ ర్ గార్డెన్ లో జరుగుతుందని దానికి మండలంలో కౌన్సిల్,కార్యవర్గ సభ్యులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా సమితి సబ్యులు తెప్పల సత్యం,అమరనేని వీరభద్రమ్, మండల కార్యవర్గ సభ్యులు బోగినబోయిన నాగేశ్వరావు, నల్లపటి నర్సింహ రావు, బనోత్ లక్ పతి, ఎల్లయ్య,తాళ్లూరి రమణ, మళ్ళెంపాటి కోటేశ్వర రావు, సొలం నాగరాజు,సీతారాములు తదితరులు పాల్గొన్నారు.