రుద్రూర్, అక్టోబర్ 9 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి)
రుద్రూర్ మండల కేంద్రంలోని మండల కాంప్లెక్స్ భవనంలో ఏర్పాటు చేసిన RO, ARO డెస్క్ ల వద్ద జడ్పీటీసీ/ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ స్థానిక సంస్థల ఎన్నికల నియమావళిని గురువారం జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి పరిశీలించారు. నామినేషన్ లకు సంబంధించిన ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో, తహసీల్దార్ తారాబాయి, అధికారులు తదితరులు ఉన్నారు.


