
పయనించేసూర్యుడు జులై 31 అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలం
స్పందనలో ఫిర్యాదు చేశామని అరుణ్ కుమార్ మరియు మరి కొంతమంది తమపై దాడి చేశారని తెలుగు యువత పార్లమెంటు ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆంజనేయులు నాయుడు తెలిపారు. బుధవారం మండల కేంద్రంలోని తెదేపా కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. జి. రెడ్డివారి పల్లి గ్రామపంచాయతీలో దొంగ పెన్షన్లు సృష్టించి ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారని, సర్వే నెంబరు 731-4 లో గల ప్రభుత్వ భూమి (గయాలు) ఆక్రమణలకు గురవుతోందని జూలై 7 వ తేదీన స్పందనలో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఆ ఫిర్యాదు పై బుధవారం రెవెన్యూ అధికారులు కొలతల కోసం రావడంతో అక్కడికి వెళ్లడంతో దాడి చేశారని అన్నారు. గ్రామస్తులతో పాటు బయట ప్రాంతాల నుండి మనసులను పిలుచుకొని పక్కాగా దాడి చేసే ప్రయత్నం చేశారన్నారు. టిడిపి రాష్ట్ర కార్యదర్శి మేడ విజయ శేఖర్ రెడ్డి అండదండలతో అక్రమాలు బయట తీసిన వారిపై ప్రశ్నించిన వారిపై దాడులకు పాల్పడుతున్నారని రక్షణ కల్పించాలని కోరారు. దానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. దాడికి పాల్పడిన వారిపై రాయచోటి రూరల్ సీఐ వరప్రసాద్ కు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. దాడిపై కేసు నమోదు చేస్తున్నట్లు సిఐ వరప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ శివరాం నాయుడు, మాజీ ఎంపీటీసీ మోహన్ బాబు నాయుడు, కిరణ్ నాయుడు, కోనంకి రమణ తదితరులు పాల్గొన్నారు.