పయనించే సూర్యుడు. జనవరి 27. ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్
ఏన్కూర్ మండలం నాచారం గ్రామంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని నాచారం గ్రామ యువత హెల్పింగ్ హాండ్స్ తరపున నాచారం ప్రాథమిక ఉప ఆరోగ్య కేంద్రం నకు మౌలిక సదుపాయాలకు సామాగ్రిని వితరణగా ఇచ్చినారు. గ్రామానికి చెందిన ఎండ్లూరి బ్రహ్మేశ్వర రావు కుమారుడు చంద్రశేఖర్ ఫ్రిడ్జ్ ను, వక్కంతుల భద్రయ్య కుమారుడు నరేష్ వాటర్ ప్యూరిఫైయర్ ను, వక్కంతుల నాగేశ్వరరావు జ్ఞాపకార్థం వారి కుమారులు ఆఫీస్ టేబుల్ ను, అలాగే యుపిఎస్ నాచారం స్కూలుకు టీవీ నీ వితరణగా ఇచ్చినారు. ఈ సందర్భంగా పీహెచ్సీ ఏన్కూర్ డాక్టర్ రాములు రాములు మాట్లాడుతూ హెల్పింగ్ హాండ్స్ తరపున సదుపాయాలను కల్పించిన నాచారం గ్రామ యువతను, గ్రామస్తులను అభినందించినారు. స్ఫూర్తిదాయకమని ప్రశంసించినారు. ఈ కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యులు డాక్టర్ మౌనిక, సిహెచ్ఓ శివరాజు, దుర్గాప్రసాద్, స్వాతి, నిర్మల, ఆశా వర్కర్లు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
స్ఫూర్తిదాయకంగా నాచారం యువత
RELATED ARTICLES