Friday, June 6, 2025
Homeఆంధ్రప్రదేశ్స్వయం ఉపాధితో వ్యాపారవేత్తగా ఎదుగొచ్చు

స్వయం ఉపాధితో వ్యాపారవేత్తగా ఎదుగొచ్చు

Listen to this article

బీఆర్ఎస్ యువ నాయకుడు వై. మురళీకృష్ణ యాదవ్

షాద్ నగర్ లో బ్రాండ్ కలెక్షన్ ఫుట్ వేర్ స్టాల్, శ్రీ వెంకటరమణ మోటార్స్ షాపులను ప్రారంభించిన మురళీకృష్ణ యాదవ్

( పయనించే సూర్యుడు జూన్ 05 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )

స్వయం ఉపాధితో వ్యాపారవేత్తగా ఎదగడంతో పాటు తోటి వారికి ఉపాధిని కల్పించేందుకు అవకాశాలు ఉంటాయని బీఆర్ఎస్ యువ నాయకుడు వై. మురళీకృష్ణ యాదవ్ అన్నారు. గురువారం షాద్ నగర్ పట్టణంలోని శరణబసప్ప కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన బ్రాండ్ కలెక్షన్ ఫుట్ వేర్, శ్రీ వెంకటరమణ మోటార్స్ సర్వీసింగ్ షాప్ లను ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. నేటి పోటీ ప్రపంచంలో మనం నిర్వహించే వృత్తిలో నైపుణ్యం, క్రమశిక్షణ ఉంటే మనం ఎంచుకున్న రంగంలో ఖచ్చితంగా రాణించగలమని అభిప్రాయపడ్డారు. ఇతరులపై ఆధారపడకుండా స్వయం ఉపాధితో వ్యాపారవేత్తలుగా ఎదుకోవచ్చని చెప్పారు. బ్రాండ్ కలెక్షన్ ఫుట్ వేర్, శ్రీ వెంకటరమణ మోటార్ వర్క్ షాప్ లను ప్రారంభించడం సంతోషకరంగా ఉందని, నాణ్యమైన సేవలను అందించి ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నటరాజ్, మాజీ కౌన్సిలర్ వెంకట్రాం రెడ్డి, మాజీ సర్పంచులు శ్రవణ్ పట్వారీ, రవి గౌడ్, యాదయ్య నాయకులు జిల్లేడు వెంకటేష్, అంచ రాజు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments