
పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 12 నిజామాబాద్
జిల్లా బోధన్ నియోజకవర్గంలోని సాలూర మండల కేంద్రంలో సాలూర గ్రామంలో ఆయన స్వగృహంలో తన చిత్రపటానికి కుటుంబ సభ్యులు మరియు అభిమానులు నివాళులర్పించారు ఆయన గత సంవత్సరం హనుమాన్ జయంతి రోజున గుండెపోటుతో మృతిచెందడం జరిగింది ఆయన ముఖం మీద చిరునవ్వు ప్రజల మీద చూపించే అభిమానం ఇప్పటివరకు సాలుర గ్రామంలో ఆయన లేనట్టుగా ఎవరు కూడా ఊహించడం లేరు మీ యొక్క నవ్వు మీ ప్రేమ మీ అభిమానం ఎవరికి రాదు ఈ ఆపద వచ్చిన నేనున్నానంటూ ముందుకు వచ్చి మాట్లాడే గొప్ప మహానుభావుడు స్వర్గీయ బుద్దే రాజేశ్వర్ ఈరోజు సంవత్సరం గడుస్తుంది అంటే నమ్మలేకపోతున్నామని మీరు చేసిన సేవలు ఈ గ్రామానికి మండలానికి చిరస్మానియంగా నిలిచిపోయాయని అందరూ నీవు ఈ గ్రామంలో ఉన్నట్టుగానే భావిస్తున్నారు ఈ ఆపద వచ్చిన అర్ధరాత్రి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసి మహానుభావుడు స్వర్గీయ బుద్దే రాజేశ్వర్ లేనిలోటు ఎవరు తీరుస్తారని సాలూర గ్రామస్తులు పేర్కొన్నారు మరియు ఈనెల 23న స్వర్గీయ బుద్దే రాజేశ్వర్ విగ్రహావిష్కరణ ఉంటుందని కుటుంబ సభ్యులు మరియు తనఅభిమానులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు