
పయనించే సూర్యుడు ఆగస్టు 26 సంగారెడ్డి జిల్లా కంగిటి మండల్
నారాయణఖేడ్ మున్సిపల్ మహా ఫంక్షన్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో, మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ కిష్టారెడ్డి 10వ వర్ధంతి సభను వారి కుమారులు, *నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ శెట్కార్, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంతారావు ముఖ్య అతిథులుగా హాజరై, స్వర్గీయ కిష్టారెడ్డి కి ఘన నివాళులు అర్పించారు. ఎంపీ సురేష్ కుమార్ శెట్కార్ మాట్లాడుతూ,”కిష్టారెడ్డి నారాయణఖేడ్ నియోజికవర్గ అభివృద్ధికి అమూల్యమైన సేవలు అందించారు. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ, ఆయన ఆశయాలను సాకారం చేయడానికి కృషి చేస్తున్నాం,” అన్నారు. కార్యక్రమంలో జిల్లా మాజీ ప్రణాళిక సంఘం సభ్యులు నాగేష్ శెట్కార్, పీసీసీ సభ్యులు శంకరాయ్యస్వామి, పీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, అభిమానులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.